హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయగా ముగ్గురు ప్రయాణికుల వద్ద బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వారి నుంచి 850 గ్రాముల బంగారు బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.