బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు వినూత్న పద్దతులను పాటిస్తున్నారు.
రంగారెడ్డి: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు వినూత్న పద్దతులను పాటిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి ఆదివారం సూట్కేసు చక్రాల్లో బంగారాన్ని అమర్చుకొని వచ్చాడు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా తనిఖీలు నిర్వహించి 484 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని విజయ్ కుమార్గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.