13 మంది జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు సస్పెన్షన్
► నాలాల పూడికతీత అక్రమాలతో సంబంధం ఉండటమే కారణం
► చర్యలు తీసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో నాలాల పూడికతీత అక్రమాలతో సంబంధమున్న 13 మంది సహాయ ఇంజనీర్లను జీహెచ్‌ఎంసీ కమి షనర్ జనార్దన్‌రెడ్డి శనివారం సస్పెండ్ చేశారు. పూడిక తరలింపు పనుల్లో కాంట్రాక్టర్లు సమ ర్పించిన నకిలీ వే బిల్లుల్ని గుడ్డిగా పాస్ చేయ డంతో అవినీతిలో ప్రమేయం ఉందనే ఆరోప ణలతో వీరిపై ఈ చర్య తీసుకున్నారు. సస్పెం డైన వారిలో ఎంఏ నయీం, కామేశ్వరి, అలీం, శ్రీనివాస్, పాపమ్మ, ప్రేరణ, జమీల్ షేక్, సంతోష్, వశీధర్, లాల్‌సింగ్, మోహన్ రావు, శంకర్, తిరుపతి ఉన్నారు. కాంట్రాక్టర్లకు సహ కరించారనే ఆరోపణలతో శుక్రవారం వీరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ బెయి ల్‌పై విడుదల చేశారు.
ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా
శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమ యంలో ఈ అరెస్టులకు నిరసనగా పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యం లో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంజనీర్లతో ఆస్తిపన్ను వసూళ్ల నుంచి చెత్త పనుల వరకు ఎన్నో పను లు చేయిస్తుండటంతో తాము అసలు విధుల ను నిర్వర్తించడంలో విఫలమవుతున్నామనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షిం చాల్సిందే కానీ..గెజిటెడ్ అధికారు లైన ఇంజ నీర్లను సీసీఏ రూల్స్ ప్రకారం శాఖా పరమైన విచారణ లేకుండానే అరెస్టు చేయ డం భావ్యం కాదన్నారు. కమిషనర్ అందుబా టులో లేకపోవడంతో సోమవారం ఆయనను కలిశాక నిర్ణయం తీసుకోవాలన్నారు.
కేసులు ఉపసంహరించకుంటే పెన్‌డౌన్
ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు ఉపసంహరిం చని పక్షంలో పెన్‌డౌన్ చేయాలని ఇంజనీర్ల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. శనివారం రాత్రి జీహెచ్‌ఎంసీ కమిషనర్ 13 మంది ఇంజ నీర్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. పూడి కతీత పనుల్లో తొలగించిన పూడికను డంపింగ్ యార్డు వరకు తరలించిన వాహనాల నంబర్ల ను బిల్లుల మంజూరు సందర్భంగా ఆడిట్ అధి కారులు పరిశీలించగా అవి స్కూటర్లు, కార్ల నంబర్లని తేలింది. వాటిల్లో పూడిక నెలా తరలిస్తారంటూ రూ. 1.18 కోట్లకు సంబంధిం చిన బిల్లులను అధికారులు నిలిపివే శారు. 18 మంది కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయడం తో వారిని వారం క్రితం అరెస్టు చేశారు. ఇంజ నీర్ల పాత్ర ఉందని కాంట్రాక్టర్లు ఆరోపించ డంతో వారిపైనా కేసులు నమోదు చేశారు. వారిపై కేసులు ఉపసంహరించుకోని పక్షంలో సోమవారం నుంచి కార్యాచరణకు దిగుతామ ని ఇంజనీర్ల సంఘం నాయకులు తెలిపారు.