సైదాఫలక్ కు ఘనస్వాగతం | syeda falak got gold medal in open karate | Sakshi
Sakshi News home page

సైదాఫలక్ కు ఘనస్వాగతం

Published Mon, Apr 11 2016 12:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

సైదాఫలక్ కు ఘనస్వాగతం

సైదాఫలక్ కు ఘనస్వాగతం

శంషాబాద్: యూఎస్‌ఏలో జరిగిన ఓపెన్ కరాటే పోటీలో గోల్డ్‌మెడల్ సాధించిన  సైదాఫలక్‌కు రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం ప లికారు. పూలమాలలు, బొకేలు, శాలువాలతో కుటుంబసభ్యులు, క్రీడాభిమానులు సన్మానించారు. యూఎస్‌ఏలో జరిగిన ఓపెన్ కరాటే పోటీల్లో 42 దేశాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న సైదా గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పోటీల్లో టైటిల్ సాధించడం తన జీవితంలో మరువలేని విషయమన్నారు.

తన సహచర క్రీడాకరులతో పాటు తన కుటుంబీకులు, స్నేహితులు ఈ చాంపియన్‌షిప్ సాధించడానికి ఎంతో సహకారం అందించారని కొనియాడారు. ఈ గెలుపుతో తనకు మరింత ఉత్సాహం వచ్చిందని, రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తానని పాతబస్తీకి చెందిన ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement