
‘కేసీఆర్‌లా దొంగ దీక్షలు చేయలేదు’
సాక్షి, హైదరాబాద్: దేశ సమగ్రత కోసం ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీతో మంత్రి కేటీఆర్ తనకు తాను పోల్చుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, తెలం గాణకు కాంగ్రెస్ వ్యతిరేకమని మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
తెలంగాణ కోసం కేసీఆర్‌లా కాంగ్రెస్ నేతలు దొంగ దీక్షలు చేయలేదన్నారు. నిజాయితీతో, చిత్తశుద్ధితో తెలంగాణ సాధించామని చెప్పారు. తెలంగాణకు అసలైన ద్రోహులు టీఆర్‌ఎస్ నేతలేనన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన మీరా కుమార్‌కు ద్రోహం చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌దని విమర్శించారు. మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం పదవి ఇస్తానని మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు.