
'టీఆర్ఎస్ లో నాకు మంత్రి పదవి వచ్చింది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీడీపీ నాయకులు బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలతో మంత్రి తలసాని పిచ్చాపాటిగా మాట్లాడుతూ... తనకు టీఆర్ఎస్ లో మంత్రి పదవి వచ్చిందని, ఏపీలో అధికారంలో ఉండికూడా మీకు మంత్రి పదవులు రాలేదని అన్నారు. తలసాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు.
కాగా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ నజరానాలు, మంత్రి పదవులను ఎర వేస్తున్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో సీఎంతోపాటు కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశంగా మారాయి.