పన్ను వసూళ్లు@ రూ.188 కోట్లు
- పన్నుల వసూళ్లలో దేశంలోనే హైదరాబాద్ టాప్
- 22 ప్రధాన నగరాల్లో జీహెచ్‌ఎంసీకి అగ్రస్థానం
- రూ.500, రూ.1,000 నోట్లతో పెరిగిన పన్ను వసూళ్లు
- పాత నోట్ల ద్వారా పన్ను వసూళ్లపై సమీక్షలో కేంద్రం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పంటపండింది. పెద్ద నోట్లతో పన్ను వసూళ్ల విషయంలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మొత్తం 22 ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ రూ.188 కోట్లు వసూళ్లు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాత నోట్ల ద్వారా జరిగిన పన్ను వసూళ్లను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ తాజాగా సమీక్షించింది.
నవంబర్ మాసంలోనే జీహెచ్‌ఎంసీ మూడింతలు ఆదాయాన్ని పొందడంపై ప్రశంసలు కురిపించింది. 22 ప్రధాన నగరాల్లో మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరం రూ.170 కోట్ల వసూళ్లతో ద్వితీయ స్థానం, రూ.150 కోట్లతో అహ్మదాబాద్ తృతీయ స్థానంలోనూ నిలిచారుు. గత ఏడాది నవంబర్‌లో కేవలం రూ.8 కోట్లను వసూలు చేసిన జీహెచ్‌ఎంసీ.. పాత నోట్లతో పన్ను చెల్లింపులకు వెసులుబాటు కల్పించడంతో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సుమారు రూ.190 కోట్ల వరకు వసూలయ్యారుు. దీంతో సుమారు 2,350 శాతం పురోగతి సాధించినట్లరుుంది. దీనిని బట్టి జీహెచ్‌ఎంసీ పాత నోట్లతో పన్ను చెల్లింపు అవకాశాన్ని పూర్తి స్థారుులో సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో..
దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన చెన్నై రూ.76.8 కోట్లు, కోయంబత్తుర్ రూ.49 కోట్లు, భోపాల్ రూ.25 కోట్లు, నాగ్‌పూర్ రూ.23 కోట్లు, గువాహటి రూ.7.92 కోట్లు మాత్రమే పన్నులను వసూలు చేయగలిగారుు. లక్నో రూ. 12.5 కోట్లను సాధించి చిట్టచివరన నిలిచింది. పాత నోట్లతో చెల్లింపులకు వెసులుబాటు కల్పించడంతో మొత్తం 22 ప్రధాన నగరాల్లో సుమారు రూ.855 కోట్లు పన్ను రూపేణా వసూలయ్యాయి.
24 వరకు పాత నోట్లతో పన్నుల వసూళ్లు
పాతనోట్లతో ఈ నెల 24 వరకు పన్నుల వసూలు ఉంటుందని జీహెచ్‌ంఎసీ మేయర్ బి.రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. పాత నోట్లతో పన్నుల వసూళ్లలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే టాప్‌గా నిలవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ దరిదాపుల్లో లేని తెలుగు నగరాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రధాన నగరాలు కూడా పన్నుల వసూళ్లల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు దరిదాపుల్లో లేకుండా పోయారుు. కేంద్రం రద్దు చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నుల వసూళ్లలో హైదరాబాద్ రూ.188 కోట్లు సాధించి టాప్‌గా నిలబడగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ రూ.20 కోట్లు, విశాఖపట్నం రూ.15 కోట్లు, విజయవాడ రూ.12 కోట్లు, గుంటూరు రూ.6 కోట్లు, తిరుపతి రూ.4.43 కోట్లు మాత్రమే పన్నులను వసూలు చేయగలినట్లు కేంద్రం ప్రకటించింది.