
తెలంగాణ బడ్జెట్ 2016-17 హైలైట్స్
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో ఈసారి అధిక వాట సాగునీటిరంగం, వ్యవసాయానికి దక్కింది. తర్వాత స్థానం సంక్షేమం ఆక్రమించింది. తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూ.1,30,415 కోట్లతో బడ్జెట్ రూపొందించామని ఈటల వెల్లడించారు. ప్రణాళికా వ్యయం రూ.67,630 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 62,785.14 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు.
వాగ్దానాల దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ తెచ్చామన్నారు. సీఎం ప్రతీశాఖ పనితీరును సమీక్షించారని వెల్లడించారు. ఈ సారి తెలంగాణ బడ్జెట్ పద్దు పెరిగిందన్నారు. గతేడాదితో రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది రూ.14,726 కోట్లు బడ్జెట్ పద్దు పెరిగింది. రెవెన్యూ మిగులు రూ.3,318 కోట్లు కాగా, ద్రవ్య లోటు అంచనా రూ.23,467.29 కోట్లని ఈటల పేర్కొన్నారు. ఇంకా అందులోని ప్రధాన అంశాలు ఏమిటంటే..
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ 2016-17:
- మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లు
- ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు
- రెవిన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
- ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
- ఈ ఏడాది ఆదాయం అంచనా రూ. 72,412 కోట్లు
వ్యవసాయం
- సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు
- కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు
- పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 7,861 కోట్లు
- సీతారామ ఎత్తిపోతలకు రూ.1,152 కోట్లు
- మిషన్ భగీరథకు రూ. 36,976 వేల కోట్లు
- వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు రూ. 6,759 కోట్లు
- రుణమాఫీకి రూ.3,718 కోట్లు
- వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్
-
డిసెంబర్ కల్లా 6 వేల గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు తాగునీరు
వైద్యం, విద్య
- ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు
- హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
- రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్, డయాగ్నొస్టిక్ సెంటర్లు
- విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 1694 కోట్లు
- విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9,044 కోట్లు
- మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం స్కూల్లు
సంక్షేమం
- సంక్షేమానికి మొత్తం రూ. 13,412 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి రూ. 3,552 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ. 4,693 కోట్లు
- కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు
రోడ్లు, భవనాలు
- రోడ్లు, భవనాలు రంగాలనికి రూ. 3,333 కోట్లు
- 4 వేల కిలోమీటర్ల కొత్త రహదారులు
- పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు
పరిశ్రమలు, ఐటీ
- పారిశ్రామిక రంగానికి రూ. 967 కోట్లు
- ఐటీ, కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు
- సీసీ టీవీల మానిటరింగ్కు రూ. 225 కోట్లు
ఇతరములు
- ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4,675 కోట్లు
- అగ్నిమాపక శాఖకు 223 కోట్లు
- సంస్కృతి, పర్యాటక రంగానికి రూ. 50 కోట్లు
- మెట్రోరైలుకు రూ. 200 కోట్లు
- క్యాంపు ఆఫీసు, కళాభారతికి రూ. 457 కోట్లు