రేపటి కేబినేట్ సమావేశం రద్దు
హైదరాబాద్ : సోమవారం జరగాల్సిన కేబినేట్ సమావేశం రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ...జిల్లాల్లో వరద పరిస్థితిని మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
గోదావరి నదికి వరద నేపథ్యంలో ఐదు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్తో సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు.