హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలను సడలించడం ద్వారా కొన్ని కంపెనీలకే ప్రాజెక్టుల టెండర్లు వచ్చేలాగా చేసి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత- చేవెళ్ల టెండర్లలో భారీగా అవినీతి జరిగిందన్నారు.
కొన్ని ప్యాకేజీలైతే టెండర్లు లేకుండానే నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు పనులను ఖరారు చేశారని ఉత్తమ్ ఆరోపించారు. తొలుత 600 కోట్లుగా అంచనాలు వేసిన ఓ ప్యాకేజీని తరువాత 3 వేల కోట్లకు అంచనా పెంచి పాత కాంట్రాక్టర్కే అప్పగించారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న లక్ష కోట్లకు సంబంధించిన పనుల్లో పారదర్శకత లోపించిందని ఆయన విమర్శించారు. ఈ టెండర్ల విధానాన్ని రద్దు చేసి గ్లోబల్ టెండర్లను పిలవాలని నీటిపారుదల శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
'ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది'
Published Wed, Feb 17 2016 5:45 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement