సత్యాన్ని గుర్తించడమే ప్రధాన విధి
న్యాయవాదులు, న్యాయమూర్తులకు జస్టిస్ చలమేశ్వర్ సూచన
హైదరాబాద్: న్యాయవాదులు, న్యాయ మూర్తులు సత్యాన్ని గుర్తించడమే ప్రధాన విధిగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ సూచించారు. ఏ కేసులోనైనా సత్యం ఏమిటో తెలుసుకోవాల న్నారు. ఇది మూడు రకాలుగా... కేసు వేసిన వైపువారి నుంచి సత్యం, ఆధారపడి ఉన్నవారి సత్యం, జడ్జి దృష్టితో ఉన్న సత్యం ఉంటుందన్నారు. గచ్చిబౌలి శాంతిసరోవర్ లో బ్రహ్మకుమారీస్, ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిళ్లు, న్యాయ శాఖ, వివిధ కోర్టుల న్యాయవాదుల సంఘాల సంయుక్త ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన న్యాయవాదులు, న్యాయ మూర్తులు, అధికారుల జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు.
జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ... ‘న్యాయ వృత్తిలో ఉన్నవారు మాట్లాడే ప్రతిమాట సమగ్ర పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడా లి. ప్రస్తుతం ప్రతిఒక్కరూ శాంతిమయ జీవితం కావాలనుకొంటున్నారు. శాంతి అత్యంత అవసరమైనదే. కానీ... శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ముందుగా సమాజం ఆర్డర్‌లో ఉండాలి. సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. భావోద్వేగాలకు అతీతులుగా ఉండాలి. అది బ్రహ్మకుమారీస్ సంస్థ నేర్పించే మెడిటేషన్ ద్వారా వస్తుందని నమ్ముతున్నా’అన్నారు.
సుఖదుఃఖాల కలయికే ఈ ప్రపంచం...
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ... సుఖ దుఃఖాల కలయికే ఈ ప్రపంచమన్నారు. ‘ఒడి దొడుకులతో కూడుకున్న ఈ ప్రపంచంలో మనసును ప్రశాంతంగా ఉంచడం కష్టం. చదువుకున్నవారికి ఉద్యోగాలుండవు. తిందా మంటే ఆహారం రుచి ఉండదు. విద్యలో నైతి కత ఉండదు. ఇలాంటి సమాజంలో శాంతి నెలకొనాలంటే స్వార్థ చింతన, అహంకారం వంటివి శాశ్వతంగా వదులుకోగలగాలి’అని జస్టిస్ రామసుబ్రమణియన్ చెప్పారు. సుఖ శాంతిమయ జీవనం కోసం ప్రతి ఒక్కరికీ మెడిటేషన్ అవసరమని జస్టిస్ సురేష్‌కుమార్‌కైత్ అన్నారు.
మనలోని బ్యాటరీ ఫుల్‌చార్జిలో ఉంటేనే ఉత్సాహంతో పనిచేయగలమని, అందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకో వాలన్నారు. న్యాయవాదులు, జడ్జీలు రోజూ ఉదయం కోర్టు వ్యవహారాలు మొదలుపెట్టే ముందు పది నిమిషాలు ధ్యానం చేయాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు చెప్పారు. ప్రస్తు తం ప్రతి చిన్న విషయానికీ కోర్టుకు వస్తున్నా రని, అందుకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నా మన్నారు. విలువలను పూర్తిగా కోల్పోతున్నా మని, విలువల ఆధారిత పునాది అవసరమ న్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, యూరోపియన్ బీకే సెంటర్స్ డైరెక్టర్ బీకే జయంతి, బ్రహ్మకుమారీస్ జూరిస్ట్ వింగ్ జాతీయ డైరెక్టర్ రాజయోగిని పుష్ప పాల్గొన్నారు.