- ఫిర్యాదు చేయకున్నా పోలీసులే సొంతంగా నమోదు చేస్తారా?
- సర్కారు తీరును ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
సాక్షి,హైదరాబాద్ : పత్రికలపై నేరుగా పోలీసులే కేసులు బనాయించే చెడు సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం దారుణమని ఐజేయూ ప్రతినిధి అంబటి అంజనేయులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావులు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో సాక్షి దినపత్రికపై నమోదు చేసిన పోలీసు కేసును వారు ఖండించారు.కేసు సెక్షన్లను గమనిస్తే.. బ్రిటీష్ పాలనలో, ఎమర్జెన్సీ కాలంలోనే ఇలాంటివి నమోదయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్, ఎడిటర్‌ను ఇరికించడం కచ్చితంగా సర్కారు కుట్రేనని అభిప్రాయపడ్డారు.
నిరంకుశ విధానాలను విడనాడాలి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ చానల్ ప్రసారాల నిలిపివేతపై ఎడిటోరియల్ డెరైక్టర్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పత్రిక వార్తల సాకుతో ఆయనపై పోలీసు కేసు నమోదు కావడం కక్ష సాధింపు చర్య అని ఏపీయూడబ్ల్యూజే నేతలు దుయ్యబట్టారు. ‘సాక్షి’ చానల్ ప్రసారాలను నిలిపివేసి, జర్నలిస్టుల ఉద్యమం ఫలితంగా పునరుద్ధరించి చేతులు కాల్చుకున్న ప్రభుత్వం ఇంకా అలాంటి చర్యలను కొనసాగించడం తగదని హితవు పలికారు.
ఏది రాయాలో జీవో ఇచ్చేయండి
‘‘పత్రికల్లో ఏది రాయాలో, ఏది రాయకూడదో ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చేస్తే బాగుంటుంది. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా... ఆ రకంగా బిల్లును ఆమోదించేసుకొని చట్టం చేసేస్తే ప్రభుత్వ పెద్దలు చెప్పినవే పత్రికలు రాస్తుంటాయి. పత్రికలకు ఆ స్వేచ్ఛ లేదా? వాస్తవాలు రాయకూడదా? ప్రజాస్వామ్యమవాదులంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అంశమిదీ’’.
- ముద్రగడ బాలు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు మేము చెప్పిందే ‘సాక్షి’లో వచ్చింది
మేము చెప్పిందే ‘సాక్షి’లో వచ్చింది
‘‘ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మీడియాతో చెప్పాం. మేం ఏదైతే చెప్పామో అదే ‘సాక్షి’ పత్రికలో వచ్చింది. అందుకు ‘సాక్షి’ని, అందులో పనిచేసే సిబ్బందిని బాధ్యులను చేసి కేసులు నమోదు చేయడం సహేతుకం కాదు’’.
- నరిసే సోమేష్, ముద్రగడ పద్మనాభం వియ్యంకుడు
‘సాక్షి’పై కేసులు కక్ష సాధింపే
Published Thu, Jul 7 2016 2:12 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement