'ఇది ఇద్దరు చంద్రుల పున్నమి' | this is a full moon to me, says governor narasimhan in at home programme | Sakshi
Sakshi News home page

'ఇది ఇద్దరు చంద్రుల పున్నమి'

Published Mon, Aug 15 2016 6:52 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

'ఇది ఇద్దరు చంద్రుల పున్నమి' - Sakshi

'ఇది ఇద్దరు చంద్రుల పున్నమి'

సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఒకే వేదిక మీద కలిశారు. రాజ్‌భవన్‌లో రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు చంద్రులను ఒకే వేదికమీద చూడటంతో తనకు ఇది నిండుపున్నమిలా కనపడుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు కరచాలనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement