సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. అయితే ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు సరిపోవడం లేదంటూ తెలుగు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లతోపాటు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ఫోనులో రైల్వే బోర్డు ఛైర్మన్కి విజ్ఞప్తి చేశారు. అందుకు రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.