ఈ ఏడాది ఎస్సీ శాఖ లక్ష్యం: డాక్టర్ ఎం.వి.రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ఎస్సీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. 10 వేల మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు ఈ ఏడాది నైపుణ్యాల శిక్షణను అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జీ వీసీ, ఎండీ డా.ఎం.వి.రెడ్డి‘ సాక్షి’ కి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదో తరగతి పాసైనవారు, ఫెయిలైనవారు ఖాళీగా ఉండకుండా ఆయా రంగాల్లో శిక్షణను అందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో తరచుగా గృహోపకరణాలు, ఇతర అంశాల్లో రిపేర్లు, ఇతరత్రాఅవసరాలకు అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు టీవీ, ఫ్రిజ్, ఎలక్ట్రీషియన్ వంటి గృహోపకరణాలు, ఇతరత్రా అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్‌లో నెల రోజులపాటు శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. గత ఏడాది 5 వేల మందికి స్కిల్‌డెవలప్‌మెంట్ శిక్షణను ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఈ ఏడాది దానిని పదివేలకు పెంచినట్లు తెలియజేశారు. లబ్ధిదారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎం.వి.రెడ్డి తెలిపారు. రుణానికి తగ్గట్టు పనులు చేయనివారిని, దుర్వినియోగం చేసినవారిని, డిఫాల్టర్లుగా ఉన్నవారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా చర్య లు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లబ్ధిదారులు చేపట్టిన పనులను వీడియో రికార్డు, ఫొటోల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఎంవీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన డేటాబేస్‌ను తయారు చేసి దశలవారీగా తనిఖీ చేస్తామన్నారు.
10 వేల మంది నిరుద్యోగులకు శిక్షణ
Published Thu, Apr 7 2016 3:46 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM
Advertisement
Advertisement