'భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం అన్యాయం' | Unjustice to govt lands to lease, selling for 99 years, says Vasireddy padma | Sakshi
Sakshi News home page

'భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం అన్యాయం'

Published Tue, Nov 3 2015 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

'భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం అన్యాయం'

'భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం అన్యాయం'

హైదరాబాద్‌: ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు అమ్మడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ మండిపడ్డారు. ఏ ప్రాతిపాదికన భూములను 99 ఏళ్లకు లీజుకిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాయలంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పేదరైతులకు కూడా 99 ఏళ్లు ప్రభుత్వ భూమి లీజుకిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

సోమవారం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలపై చర్చించలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, డెల్టాలో ఎండిపోతున్న పంటలు, ప్రత్యేక హోదా, ధాన్యం సేకరణపై కేబినెట్‌లో చర్చించకపోవడం దారుణమన్నారు. కాపులకు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి.. ముష్టేసినట్టు 100 కోట్లు ఇవ్వడం సమంజసమా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement