హైదరాబాద్: హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వైఎస్ చాన్సలర్(వీసీ) పొదిలె అప్పారావును తొలగించాలనీ, సెలవుపై వెళ్లిన ఇన్‌చార్జి వీసీ బిపిన్ శ్రీవాత్సవను వీసీగా తిరిగి నియమించొద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు విద్యార్థి జేఏసీ ఆదివారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు లేఖ రాసింది.
యూనివర్సిటీ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వేముల రోహిత్ కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న రోహిత్ స్కాలర్షిప్ సొమ్మును తక్షణమే విడుదల చేసి అతని కుటుంబానికి అందించాల్సిందిగా తెలిపింది. అంతేకాక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ రోహిత్ మెమోరియల్ లెక్చర్ను ఏర్పాటు చేయాలని తెలిపింది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐదుగురు దళిత విద్యార్థులపై కుల వివక్షతో ప్రవర్తించడమే కాకుండా వారిని హెచ్సీయూ నుంచి సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ కారణంగా మనస్తాపం చెందిన వారిలో ఒకరైన వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైనందుకుగానూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్యాంపస్లో వివక్ష, కులబేధం వంటి విషయాలకు తావు లేకుండా అందరితో కలిసిపోయేలా వాతావరణం ఉండేలా నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులతో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉన్నత చదవుల కోసం యూనివర్సిటీలకు వచ్చే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు రక్షణ కల్పించేలా 'రోహిత్ యాక్ట్' ను తీసుకవచ్చి.. దాన్ని తప్పుకుండా అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రక్టోరియల్ బోర్డు తొలగించిన అలోక్ పాండే సహా విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ అధ్యాపక సభ్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, అధికారులు సమర్పించిన వారి రాజీనామాలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంగీకరించవద్దని కోరింది. అలాగే సాధ్యమైనంత తొందరగా వారు తమ బాధ్యతలను స్వీకరించాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను అప్పీల్ చేయాల్సిందిగా విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది.
శ్రీవాత్సవ వీసీగా వద్దు... అప్పారావును తొలగించాలి
Published Sun, Jan 31 2016 8:29 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
Advertisement
Advertisement