
పోలీసుల అదుపులో దేవేందర్ గౌడ్ పుత్రరత్నం
టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ను శుక్రవారం కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై వీరేందర్ గౌడ్ను పోలీసులు కుషాయిగూడ పోలీసు స్టేషన్కు తరలించారు.
వీరేందర్తోపాటు మరికొందరు టీడీపీ నేతలను కూడా పోలీసు స్టేషన్కు తరలించిన వారిలో ఉన్నారు. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జ్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.