సామూహిక సెలవులపై వరంగల్ రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లు!
- పదోన్నతుల వ్యవహారం నాన్చడమే కారణం
- నాలుగేళ్లుగా తమకు తీరని అన్యాయం చేశారంటూ ఆరోపణ
- ఇంటెలిజెన్స్‌లోని ఓ అధికారి, మంత్రి పేషీలోని మరో అధికారిపై ఆరోపణలు
- వారి వల్లే పదోన్నతులు ఆగిపోతున్నాయంటూ అన్ని రేంజుల్లో లొల్లి..
- పోలీస్ శాఖలో మరింత అగ్గిరాజేసిన పదోన్నతుల మంట
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో పదోన్నతుల లొల్లి తీవ్రమైంది. నాలుగేళ్లుగా తమ పదోన్నతిని ఆపుతున్నారంటూ వాపోతున్న వరంగల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్లు.. ఇక తమ వల్ల కాదంటూ సామూహిక సెలవులో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ సందేశం పోలీస్ శాఖను కుదిపేసేలా కనిపిస్తోంది. అంటిపట ్టనట్టుగా వ్యవహరిస్తున్న పోలీస్ ఉన్నతాధికా రులు, పదోన్నతులపై కాళ్లరిగేలా తిరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని వరంగల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్లు స్పష్టం చేశారు.
ఇదీ వరంగల్ ఇన్‌స్పెక్టర్ల సందేశం: ‘ప్రమోషన్ల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటా నికి మేం సిద్ధమవుతున్నాం. 1991లో ఎస్‌ఐ లుగా పోలీస్ శాఖలోకి వచ్చాం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చివరగా కొంతమంది గుంటూరు, హైదరాబాద్ రేంజ్ పోలీస్ అధికారులకు అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా.. అప్పటి డీజీపీ జీవో నంబర్ 54 కింద ఇన్‌స్పెక్టర్ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు తయారుచేశారు. అయితే అది పూర్తి తప్పుల తడకగా ఉంది. మాకు రావాల్సిన నాలుగేళ్ల సీనియారిటీని పట్టించుకో కుండా అడ్డదిడ్డంగా లిస్ట్ తయారుచేశారు. వరంగల్ జోన్ 1991 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల లిస్టు సరి చేసి ప్రమోషన్స్ ఇవ్వమని, డీఐజీ, ఐజీ, డీజీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ మూడున్నరేళ్ల నుంచి తిరుగుతున్నాం.
అయినా ఎలాంటి ఫలితం లేదు. చివరకు కోర్టు ఆదేశాల ప్రకారం జీవో నంబర్ 54ను రెక్టిఫైడ్ చేసినా.. ఏడాది నుంచి మాకు పదోన్నతులు ఇవ్వడం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి హైదరాబాద్ జోన్ అధికారుల కు లబ్ధి కలిగించాలని చూస్తున్నారు. వరంగల్ జోన్‌లో జూనియర్లకు కూడా మూడున్నరేళ్ల క్రితమే డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించా రు. పదో న్నతులు రెండు మూడు రోజుల్లో ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. కానీ అర్హత లేకున్నా 1995, 1996 బ్యాచ్ హైదరాబాద్ రేంజ్ అధికారులకు కూడా డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చూస్తున్నారు.
ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిడులకు లొంగి పోలీసు వ్యవస్థను భ్రష్టుప ట్టిస్తూ మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మంత్రి పేషీలో ఉన్న ఓ అధికారి, సెక్యూరిటీ వింగ్‌లో కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్న మరో అధికారి లాబీయింగ్ చేస్తూ అడ్డు పడుతు న్నారు. చివరిగా వరంగల్ జోన్ 1991 బ్యాచ్ ఎస్సైలందరం మూకుమ్మడి సెలవులు పెట్టి డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు, ప్రభుత్వంపై పోరాటం చేద్దామనుకుంటున్నాం..’ ఇది వరంగల్ జోన్‌కు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న 1991 బ్యాచ్ ఇన్‌స్పెక్టర్లు తమ వాట్సాప్ గ్రూపుల్లో పంపుకున్న సందేశం.
మాకు రాకుంటే మీకు రానివ్వం..
ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు నియంత్రణకు కృషి చేసిన పోలీస్ అధికారులకు అగ్జిలేటరీ ప్రమోషన్ పేరుతో అందలం ఎక్కిం చారు. ఎంత మందిని చంపితే అన్ని ప్రమోషన్లు అంటూ అప్పటి అధికారులు ఎడాపెడా పదోన్నతులు కల్పించారు. అయితే ఈ అగ్జిలేట రీ ప్రమోషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పదోన్నతి రాకపోవడానికి అగ్జిలేటరీ ప్రమోషన్లు పొందిన అధికారులే కారణమని వరంగల్ రేంజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. గతంలో అగ్జిలేటరీ ప్రమోషన్లు పొంది సెక్యూరిటీ వింగ్, మంత్రుల పేషీల్లో పని చేస్తున్న అధికారులే పదోన్నతులు రాకుండా అడ్డుకుం టున్నారని పోలీస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఒకరు నాన్‌క్యాడ ర్ ఎస్పీ పదోన్నతి కోసం, మరొకరు అదనపు ఎస్పీ పదోన్నతి కోసం మిగిలిన వారికి ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు న్నాయి. తమకన్నా నాలుగేళ్ల జూనియర్ ఆఫీసర్ అదనపు ఎస్పీగా పదోన్నతి పొందుతుంటే.. తాము ఇంకా ఇన్‌స్పెక్టర్ హోదాలోనే పని చేయడం కన్నా ఉద్యోగానికి సెలవుపెట్టడం మంచిదని వరంగల్ రేంజ్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
భగ్గుమంటున్న వ్యవహారం..
రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుత వివాదం మొత్తం డీఎస్పీ పదోన్నతుల చుట్టే తిరుగు తోంది. సీఎస్ నుంచి హోంమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాల యం.. ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్న ఇన్‌స్పెక్టర్ల వ్యవహారంతో ఉన్నతాధికారులు చూస్తూ ఊరుకోవడం తప్ప సద్దుమణి గించే చర్యలు చేపట్టకపోవడం మరింత కలవరానికి గురిచేస్తోంది. తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా ప్రభుత్వమే చేయాల్సి ఉందంటూ దాటవేయడం అన్ని రేంజుల ఇన్‌స్పెక్టర్లలో మరింత అగ్గిరాజేసినట్టు కనిపిస్తోంది.