వేసవికి ముందే పడిపోతున్న భూగర్భ జల మట్టం
ఆదిలాబాద్ జిల్లా బజర్‌హత్నూర్‌లో పాతాళానికి నీళ్లు
8 జిల్లాల్లో గత ఏడాది కంటే పడిపోయిన భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు అంతకంతకు పడిపోతున్నాయి. వేసవి రాకముందే పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ ఏడాది జనవరికి సంబంధించి భూగర్భ జలాల పరిస్థితిని వివరిస్తూ భూగర్భ జల శాఖ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది జనవరిలో రాష్ట్రంలో 10.97 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభించగా... ఈ ఏడాది అదే నెలలో 13.75 మీటర్ల లోతుల్లోకి చేరాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో గత ఏడా ది జనవరిలో 16.45 మీటర్ల లోతుల్లో నీరు లభ్యంకాగా... ఈ ఏడాది జనవరిలో 23.82 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయాయి.
నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది జనవరిలో 12.13 మీటర్ల లోతుల్లో నీరు లభ్యం కాగా... ఈ ఏడా ది అదే నెలలో 18.35 మీటర్ల లోతుల్లోకి చేరాయి. ఆదిలాబాద్ జిల్లా బజ ర్‌హత్నూర్ మండల కేంద్రంలో గత ఏడాది జనవరిలో 6.1 మీటర్ల లోతు ల్లో భూగర్భ జలాలు లభ్యంకాగా... ఈ ఏడాది అదే నెలలో ఏకంగా 26.12 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే అత్యంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జల శాఖ స్పష్టం చేసింది. 20 మీటర్లకుపైగా భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలు అధికంగా మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉండగా... రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ఉన్నాయి.
పాతాళానికి పోవాల్సిందే!
Published Tue, Feb 16 2016 3:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement