
'ఐటీలో నంబర్ 1గా హైదరాబాద్..!'
హైదరాబాద్: ఐటీలో నంబర్ 1గా హైదరాబాద్ ను తీర్చి దిద్దుతామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ఐటీ పాలసీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, మంత్రి కేటీఆర్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ పాలసీలో నాలుగు సబ్ పాలసీలు ఉంటాయని చెప్పారు. 1.రూరల్ ఐటీ, 2.ఇన్నోవేషన్, 3.గేమింగ్ అండ్ యానిమేషన్, 4.ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ మ్యాన్ఫ్యాక్చరింగ్ అని చెప్పారు. కొత్తగా ఆవిష్కరించిన ఐటీ పాలసీ ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీ పాలసీతో రూ.1,36వేల కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.