హైదరాబాద్: ప్రతి కార్మికుడికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) సౌకర్యం కల్పిస్తామని, అవసరమైతే ప్రీమియం తగ్గిస్తామని కేంద్ర, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. కార్మికులకు కనీస పెన్షన్ రూ. 1000 చేశామని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. బోనస్ సవరించి రూ. 10 వేల నుంచి రూ.21 వేల వరకు పెంచామన్నారు. కార్మికులందరికీ యు విన్ కార్డులు అందుబాటులో తెస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో లాక్ అవుట్ లు లేవు అని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, కరీంనగర్ ఎంప్లాయ్ మెంట్ కార్యాలయాలను ఆధునీకరిస్తామన్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఇళ్లు కట్టిస్తామని దత్తాత్రేయ తెలిపారు.
'ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాం'
Published Sat, Jun 4 2016 6:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement