ఇరిగేషన్‌కు ప్రతినెలా రూ.2,083 కోట్లు
హైదరాబాద్: తెలంగాణలో నీటిపారుదలశాఖపై సోమవారం ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కృష్ణా, గోదావరిపై తలపెట్టిన ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన అన్నారు. పాలమూరు, పెనుగంగ ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవాలని చెప్పారు. ఇరిగేషన్‌కు ప్రతినెలా రూ. 2,083 కోట్లు విడుదల చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరాలని కేసీఆర్ ఆకాంక్షించారు.