సెంటిమెంట్‌ నై..శాలరీకే జై | WisdomJobs.com survey of 150 companies | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్‌ నై..శాలరీకే జై

Published Mon, Jul 3 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

సెంటిమెంట్‌ నై..శాలరీకే జై

సెంటిమెంట్‌ నై..శాలరీకే జై

41% మంది అధిక వేతనాలవైపే మొగ్గు.. 32% మంది కెరీర్‌కు ప్రాధాన్యత 
విస్‌డమ్‌జాబ్స్‌.కామ్‌ సర్వేలో వెల్లడి... 
 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సాధారణమే. ఇందుకు రకరకాల కారణాలున్నా... అత్యధికంగా 41 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాలు మారుతుంది మాత్రం అధిక వేతనాల కోసమేనని తాజా సర్వేలో తేలింది. ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్స్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ విస్‌డమ్‌జాబ్స్‌.కామ్‌.. పది రంగాలకు చెందిన 150 కంపెనీలపై సర్వే నిర్వహించింది. ప్రధానంగా రిటైల్, హెల్త్‌కేర్, ఐటీ, తయారీ, మౌళిక వసతులు, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, లాజిస్టిక్స్, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు చెందిన ఉద్యోగులపై ఈ సర్వే చేసినట్టు సంస్థ తెలిపింది. ఈతరం ఉద్యోగులు సొంత సంస్థ, సర్వీసు తదితర సెంటిమెంట్లను పట్టించుకోవడం లేదని వెల్లడైంది. ఇక నగరంలో 10.2 శాతం మంది ఉద్యోగులు చేస్తున్న పని కారణంగా తీవ్ర ఒత్తిడి, సంఘర్షణకు గురువుతున్నారని పేర్కొంది. అదేక్రమంలో సంస్థలు కూడా తమ ఉద్యోగులను కాపాడుకోవాడానికి, వారి నుంచి అత్యున్నత స్థాయిలో పని రాబట్టుకోవడానికి వివిధ రకాల ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని సర్వేలో తేలింది. 
 
ఉద్యోగులను కాపాడుకోవడంలో కంపెనీల వ్యూహం ఇలా ఉంది..
► 38% కంపెనీలు సరైన శిక్షణ, మార్గదర్శనం చేయడం ద్వారా ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తు న్నాయట. 
► 45% సంస్థలు పాజిటివ్‌ వర్క్‌కల్చర్,ఆనందకరమైన వాతా వరణంలో ఉద్యోగులను పని చేయనిస్తేనే వారు పదికాలాల పాటు కంపెనీకి అంటిపెట్టుకొని ఉంటారని భావిస్తున్నాయి. 
► 30% కంపెనీలు తరచూ ఉద్యోగులతో మాట్లాడడం, వారి యోగక్షేమాలు కనుక్కోవడం ద్వారా వారిని ఎక్కువకాలం కంపెనీకి సేవలందించేలా చేయవచ్చని చూస్తున్నాయి. 
► 73% కంపెనీలు ఉద్యోగులకు మెరుగైన ఇన్సెంటివ్‌లు, పరిహా రాలు, ఇంక్రిమెంట్లు, అలవెన్సులు కల్పించి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 
► 55%  కంపెనీలు అధికవేతనాలు, ఇతర ఆర్థిక అలవెన్సులు కల్పిస్తేనే ఉద్యోగులు మొగ్గుచూపుతారని భావిస్తున్నాయి. 
► 40% కంపెనీలు ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తేనే వారు ఎక్కువకాలం సంస్థలో పనిచేస్తారని అభిప్రాయపడ్డాయి. 
► 33 % కంపెనీలు సమయపాలన విషయంలో కాస్త వెసులుబాటు కల్పిస్తే ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాయట. 
 
వివిధ రంగాల్లో వేతనాల పెరుగుదల ఇలా ఉంది..
► బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్‌లు 19.5 శాతం మేర ఉన్నాయని తేలింది. 
లాజిస్టిక్స్‌ రంగంలో కేవలం 10.9 శాతం వేరియబుల్‌ పే ఉన్నట్లు వెల్లడైంది. 
ఆటోమోటివ్, ఐటీ, రిటైల్, నిత్యావసరాలు, హెల్త్‌కేర్‌ సంస్థల్లో 15 నుంచి 17 శాతం వరకు నగదు ప్రోత్సాహకాలిస్తున్నాయి.
43% కంపెనీలు ఉద్యోగులకు అనువైన పని గంటలు కల్పిస్తే చాలని భావిస్తున్నాయట. 
70% కంపెనీలు ఉద్యోగుల శిక్షణకు ప్రాధాన్యతనిస్తుండగా.. 30 శాతం వ్యక్తిత్వ వికాస శిక్షణ అందిస్తున్నాయి. 
27 శాతం సంస్థలు ఇంధన అలవెన్స్, ఫుడ్‌ కూపన్స్, క్లబ్‌ మెంబర్‌షిప్స్‌ ఇస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement