పెళ్లైన వారం రోజులకే వేధింపులు..
Published Fri, Mar 10 2017 12:36 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM
మేడ్చల్: పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవక ముందే అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని యాప్రాల్ ఎలైట్ కాలనీకి చెందిన భాస్కర్‌గౌడ్ రైల్వేశాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత నెలలో అతనికి అర్చనతో వివాహం జరిగింది. పెళ్లైన వారం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధిస్తున్నాడని అర్చన జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భాస్కర్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement