ప్రతి విద్యార్థిని ఒక రక్షక భటురాలిగా వ్యవహరించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని 'షి' పోలీసు విభాగం డీసీపీ స్వాతిలక్రా అన్నారు.
ప్రతి విద్యార్థిని ఒక రక్షక భటురాలిగా వ్యవహరించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని 'షి' పోలీసు విభాగం డీసీపీ స్వాతిలక్రా అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా కళాశాలలో 'మహిళా రక్షణ' పేరిట జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో ఈవ్‌టీజింగ్‌లు, వరకట్న వేధింపులు జరగడం దురదృష్టకరమన్నారు. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో 'హాక్-ఐ' యాప్ను డౌన్‌లోడ్ చేసుకోవాలని... ఎటువంటి ఆపద ఎదురైనా 'షి' పోలీసుల సాయం లభిస్తుందని చెప్పారు.