కొండంత అండ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తవిని గుండె పగిలి మరణించినవారి కుటుంబాలను ఓదారుస్తానని నల్లకాల్వలో
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఆయన సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర బుధవారం దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమై నల్లమల అటవీ ప్రాంతంలోని గువ్వలగుట్ట వరకు సాగింది. కొండలు.. కోనలు దాటి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి బాధలు విన్నారు. కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.