వాషింగ్టన్ : టెక్సాస్‌లో విమానం కూలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. టేకాఫ్ అవుతుండగా.. రన్‌వేపై ఉన్న హ్యాంగర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో విమానంలో మంటలు చెలరేగి.. అందులో ఉన్న ప్రయాణికులంతా అగ్నికి ఆహుతయ్యారు. రెండు ఇంజిన్ల బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఏయిర్ 350 రకానికి ప్రమాదానికి గురైనట్లు అధికారుల తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 10 మంది ప్రయాణికులు కాలి బూడిదయినయిట్లు అధికారులు వెల్లడించారు. విమానం టేకాఫ్ సమయంలో హ్యాంగర్‌ను ఎందుకు ఢీకొట్టిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో హ్యంగర్‌లో ఎవరూ లేనట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment