న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో ఇప్పడు మరో వ్యాధి అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. టాక్సి షాక్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వ్యాధి కారణంగా ముగ్గురు చిన్నారులు చనిపోగా, మొత్తం న్యూయార్క్ వ్యాప్తంగా వంద మంది పిల్లలకు వ్యాధి సోకింది. అంతేకాకుండా ఇంకొంత మంది పిల్లల్లో కరోనా సోకిన 6 వారాల తర్వాత టాక్సి షాక్ సిండ్రోమ్ వ్యాధిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పిల్లల్లో జ్వరం, నీరసం, ఆకలి వేయకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా హాస్పిటల్‌కి తీసుకురావాలని, పరిస్థితి క్షీణిస్తే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా 5 సంత్సరాల కంటే తక్కువ వయసున్న ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడ్డారని, 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో 16 శాతం కేసులు సంభవిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఓ వైపు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలను కరోనా కబలిస్తుంటే, ఇప్పుడు టాక్సి షాక్ సిండ్రోమ్ కారణంగా చనిపోతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం కేవలం న్యూయార్క్‌లోనే టాక్సి షాక్ సిండ్రోమ్ వ్యాధి కనిపిస్తుందని అయితే ఇతర రాష్ర్టాల నుంచి కూడా దీనికి సంబందించిన డేటా కలెక్ట్ చేస్తున్నమని, చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో సూచించారు. (న్యూయార్క్‌లో శవాల గుట్ట! )
Dear Families, Please read the attached letter, it contains information about the Pediatric Multi-System Inflammatory Syndrome (PMIS). PMIS is new health condition that is appearing in children in NYC and may be associated with COVID-19. Please be aware of the symptoms. pic.twitter.com/yu2KNKfGVt
— P.S. 119 (@PS119x) May 11, 2020
Comments
Please login to add a commentAdd a comment