'ట్విట్టర్-ఇన్-చీఫ్' ట్రంప్ నే!
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసి, వైట్ హౌస్ లోకి అడుగుపెట్టి రేపటికి 100 రోజులు కావొస్తోంది. అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి, ఏ ప్రకటన చేయాలన్నా ట్రంప్ ఎక్కువగా వాడింది సామాజిక్ మాధ్యమం ట్విట్టర్ నే. ట్విట్టర్ ద్వారానే తన పాలన వ్యవహారాలను ఎక్కువగా ప్రజలతో పంచుకున్నారు. అయితే 100 రోజుల పాలనలో భాగంగా ట్రంప్ 489 మేర ట్వీట్లు చేసినట్టు వెల్లడైంది. అంటే రోజుకు కనీసం ఐదు ట్వీట్లనైనా ట్రంప్ చేసేవారని థామస్ రాయిటర్స్ తెలిపింది. వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ వాడిన తొలి అమెరికా ప్రెసిడెంట్ ట్రంపేనని తెలిపింది. 2009లో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ట్రంప్ ఇప్పటివరకు 34,800మేర ట్వీట్లను చేసినట్టు వెల్లడైంది.
ట్విట్టర్ లో యాక్టివ్ గా ఒకానొక ప్రముఖ రాజకీయ నేతల్లో ట్రంప్ కూడా ఒకరని తెలిసింది. ట్విట్టర్ పై ఉన్న ప్రేమను సైతం ట్రంప్ అంతకమున్నుపు చాలాసార్లు వ్యక్తపరిచారు. 2012 నవంబర్ లో '' ఐ లవ్ ట్విట్టర్. ఇది నష్టాలు లేకుండా మీ సొంత వార్తాపత్రికను సొంతంచేసుకోవడం వంటిది'' అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు 5,033 రీట్వీట్స్, 5,399 లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ 28.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్రంప్ కు ముందు ప్రెసిడెంట్ గా చేసిన బరాక్ ఒబామా అధికారిక అకౌంట్ కు కేవలం 13.5 మిలియన్ల మందే ఫాలోవర్స్ ఉన్నట్టు తెలిసింది. ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేవలం 342 ట్వీట్లను మాత్రమే చేశారు. ఒబామా కంటే అత్యధికంగా ట్రంప్ తొలి 100 రోజుల పాలనలోనే ఆయన ట్వీట్లను అధిగమించారు. ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన రెండు ట్వీట్లు మీకోసం...