ఇరాక్: దక్షిణ ఇరాక్‌లో ఆదివారం జంట బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. ఈ జంట పేలుళ్లలో దాదాపు 33 మంది దుర్మరణం చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రిస్క్యూం టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు భద్రతా దళాల అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, బాగ్దాద్‌కు సమీపంలో కారు బాంబు పేలుడు దుర్ఘటన జరిగిన ఒక్కరోజు తరువాత ఈ జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. యాత్రికులను లక్ష్యంగా జరిగిన ఈ పేలుడు దుర్ఘటనలో 23 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.