న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 34 మిలిటెంట్ గ్రూపులు గతేడాది డిసెంబర్ నాటికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు విధేయత ప్రకటించాయని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తెలిపారు. ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, లిబియా, నైజీరియా వంటి దేశాల్లో ఐఎస్ అనుబంధ గ్రూపులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చని ఆయన హెచ్చరించారు.