సిరియాలో ఉగ్రదాడి: నలుగురి మృతి | 4 killed in rebel attack in Syria | Sakshi
Sakshi News home page

సిరియాలో ఉగ్రదాడి: నలుగురి మృతి

Published Sat, Jun 24 2017 11:14 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

4 killed in rebel attack in Syria

డమస్కస్‌: సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిరియాలోని అలెప్పో అల్‌ ఫుర్‌ఖాన్‌ వీధిలో శుక్రవారం ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
 
పవిత్ర మాసమైన రంజాన్‌ నెలలో చివరి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు మార్కెట్‌లో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో రాకెట్‌ లాంచర్‌ ప్రయోగించడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement