
రోమ్ : ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. వైరస్ కారణంగా ఆ దేశంలో బుధవారం ఒక్కరోజే 475 మంది చనిపోయారు. కరోనా కారణంగా ఇంత భారీ సంఖ్యలో ఒక్కరోజే మరణాలు సంభవించడం ఇంతవరకు ఏ దేశంలోనూ జరగలేదు. దీంతో, ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2,978కి, కేసుల సంఖ్య 35,713కి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. బుధవారం ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు.
మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ దాటింది. కోవిడ్‌తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్‌లో 3,422 మంది మరణించారు. అమెరికాలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య బుధవారానికి 105కి చేరింది. మొత్తం 50 రాష్ట్రాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6500కి పెరిగింది. భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. (కేసులు 2లక్షలు మరణాలు 8వేలు)
Comments
Please login to add a commentAdd a comment