వాషింగ్టన్: వుహాన్ అనే ఓ చిన్న నగరంలో పుట్టి ప్రపంచానికే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైరస్ కరోనా. ఈ వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి దాకా దాదాపు 2,50,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సుమారు 4 మిలియన్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నారు. చైనా కారణంగా ప్రపంచ మొత్తం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే దీనికి చైనా ఎంత మాత్రం బాధ్యత వహించదు అంటూ' అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ రాబర్ట్ ఓ బ్రయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ప్యాకేజీపైనే దృష్టి : ఆరంభ లాభాలు ఆవిరి
వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చైనా నుంచి వచ్చే ఇలాంటి విపత్తులను ఇక భరించడం కష్టం, వాటికి ఎక్కడో ఓ చోట అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. గడిచిన 20 ఏళ్లలో చైనా నుంచి ఐదు ప్లేగు లాంటి మహమ్మారులు వచ్చాయి. సార్స్, బర్డ్ ప్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా లాంటివన్నీ చైనా నుంచి వచ్చినవే. ఇలా చైనా ప్రపంచం మీదకు వదులుతున్న భయంకరమైన పరిస్థితిని ఇంకెంతో కాలం భరించలేమని రాబర్ట్ ఓ బ్రయాన్ వ్యాఖ్యానించారు.
చైనాలో పబ్లిక్ హెల్త్ క్రైసిస్‌ను నిలువరించడం కష్టసాధ్యమైంది. కావాలంటే ఇలాంటి వైరస్‌లను నిలువరించడానికి అమెరికా సహాయమందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంది. కరోనా ప్రభావం దాదాపు 212 దేశాలపై ఉంది. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా బాగా దెబ్బతిన్నాయని' ఓ బ్రయాన్ పేర్కొన్నారు. చదవండి: లాక్‌డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ
Comments
Please login to add a commentAdd a comment