త్లాహులిల్‌పాన్: దక్షిణ అమెరికాలోని మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హిడాల్గో రాష్ట్రంలోని త్లాహులిల్‌పాన్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ ఆయిల్ పైప్‌లైన్‌కు అక్రమంగా అమర్చిన ట్యాప్ లీక్ కావడంతో పెట్రోల్‌ను పట్టుకునేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారికి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ సంతాపం తెలిపారు. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ పెమెక్స్ పైప్‌లైన్ల నుంచి మాఫియా, డ్రగ్ డీలర్లు ఇంధనాన్ని దొంగలించడం మెక్సికోలో సర్వసాధారణం. దీనివల్ల ఒక్క 2017లోనే రూ.21,376 కోట్ల ఆదాయాన్ని మెక్సికో కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment