డియర్‌ ప్రెసిడెంట్‌.. నాపేరు ఎవా.. | 7 years old Ava olsen letter to Donald Trump | Sakshi
Sakshi News home page

డియర్‌ ప్రెసిడెంట్‌.. నాపేరు ఎవా..

Published Mon, Feb 5 2018 10:52 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

7 years old Ava olsen letter to Donald Trump - Sakshi

డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖరాసిన ఏడేళ్ల చిన్నారి ఎవా ఓస్లేన్‌

వాషింగ్టన్‌ : అమెరికాలోని సౌత్‌ కరొలినాలోగల టౌన్‌విల్లే పట్టణంలో ఎవా ఓస్లేన్‌ అనే చిన్నారి.. స్నేహితుడు జాకోబ్‌తో కలిసి రోజూ స్కూల్‌కు వెళ్లేది. ఒకరోజు 14 ఏళ్ల అబ్బాయి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జాకోబ్‌.. చికిత్స పొందుతూ మూడురోజుల తర్వాత మరణించాడు. 2016లో ఈ ఘటన ఎవా కళ్లముందే జరిగింది. కాల్పుల తాలూకు షాక్, స్నేహితుడు దూరమయ్యాడన్న బాధతో ఎవా మానసికంగా కుంగిపోయింది. పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడిపోతోంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమెకు ఇంటివద్దే చదువు చెబుతున్నారు

ఏడాది తర్వాత లేఖ..
స్నేహితుడి మరణాన్ని మర్చిపోలేని ఎవా 2017 ఆగస్టులో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాసింది. ‘డియర్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్, నా పేరు ఎవా రోస్‌ ఓస్లేన్‌. నాకు ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్నాను. గత ఏడాది టౌన్‌విల్లే ఎలిమెంటరీ స్కూల్‌ దగ్గర జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు జాకోబ్‌ ప్రాణాలు కోల్పోయాడు. అది చూసి నేను చాలా భయపడ్డాను. జాకోబ్‌ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తుపాకులు అంటే అసహ్యం. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ని కోల్పోయాను. మీరు చిన్నారులకు రక్షణ కల్పిస్తారా? మమ్మల్ని ఎలా కాపాడుతారు?’ అంటూ లేఖలో ప్రశ్నించింది.

ట్రంప్‌ సమాధానం..
‘డియర్‌ ఎవా, నీ స్నేహితుడు జాకోబ్‌ మరణం గురించి బాధపడుతున్నా. చిన్నారులు అన్ని విషయాలు నేర్చుకునేది పాఠశాలలోనే. అక్కడ భయం ఉండకూడదు. అమెరికాలో చిన్నారులు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చేయడమే నా లక్ష్యం. అమెరికన్ల రక్షణ గురించి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత కృషి చేస్తాన’ని లేఖలో పేర్కొన్నారు.   

ఏం చేస్తారో చెప్పనేలేదు..
ట్రంప్‌ నుంచి వచ్చిన సమాధానం చూసి ఎవా చాలా సంతోష పడింది. అయితే ఆ లేఖలో పిల్లల రక్షణ కోసం ఏం చేస్తారో చెప్పనేలేదంటూ ట్రంప్‌కు మరో ఉత్తరం రాసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తనకు తోచిన విధంగా ఐడియాలను కూడా రాసి మరో లేఖను పంపించింది.
–సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌ 

కాల్పుల్లో మరణించిన జాకబ్‌

ఎవా ఓస్లేన్‌ రాసిన లేఖలో ఒక భాగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement