
బోటు మునిగి 71 మంది గల్లంతు
జకార్తా : ఇండోనేషియా దక్షిణ స్లువేసి ప్రావిన్స్లో బోటు మునిగిన సంఘటనలో 71 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారి కోసం అన్వేషణతోపాటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా బోటులో ప్రయాణిస్తున్న మరో 47 మందిని మాత్రం సిబ్బంది కాపాడారని చెప్పారు.
శనివారం 118 మంది ప్రయాణికులతో ఇండినోషియా దక్షిణ స్లువేసిలోని కొలకొ నుంచి సీవా నౌకాశ్రయానికి వెళ్తుండగా బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.