పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు | 15 missing after ship, boat collision in Indonesia | Sakshi
Sakshi News home page

పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు

Published Sat, Nov 19 2016 7:56 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు - Sakshi

పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు

జకర్తా: ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో పడవను నౌక ఢీకొట్టిన ఘటనలో కనీసం 15 మంది గల్లంతయ్యారు. శనివారం తుర్బాన్ జిల్లా జలాల్లో వియత్నాం నౌక, ఇండోనేసియా పడవ ఢీకొన్నాయి. ఇండోనేసియా పడవలో 27 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో గల్లంతయిన వారందరూ పడవలో ప్రయాణిస్తున్న వారేనని అధికారులు చెప్పారు. పడవలో ఉన్నవారిలో 12 మందిని సురక్షితంగా కాపాడమని తెలిపారు. మిగిలివారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తూర్పు జావా ప్రావిన్స్ రాజధాని సురబయలోని ఓడరేవుకు వియత్నాం నౌక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement