అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్తుండగా షాకింగ్.. | a car set to RAM Trump motorcade viral in social media | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్తుండగా షాకింగ్..

Published Thu, Aug 31 2017 4:54 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్తుండగా షాకింగ్.. - Sakshi

అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్తుండగా షాకింగ్..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ వెళ్తుంటే అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ట్రంప్ కాన్వాయ్ వైపుగా ఓ కారు ఒక్కసారిగా రోడ్డుమీదకు దూసుకొచ్చింది. అయితే ఏదో సాంకేతిక లోపంతో కారు అక్కడికక్కడే నిలిచిపోవడంతో చీఫ్ సెక్యూరిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలిలా.. అధ్యక్షుడు ట్రంప్ మిస్సోరిలో ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇంతలో ఓ తెల్లకారు రోడ్డుమీదకు దూసుకొచ్చింది. అయితే చెట్ల వెనుక నుంచి కారు రోడ్డు మీదకు రావడం, అది కూడా ట్రంప్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో అధికారులు కంగుతిన్నారు.

అప్పటికే ట్రంప్ కాన్వాయ్ లోని కొన్ని వాహనాలు ముందుకెళ్లగా, సెక్యూరిటీకి సంబంధించిన ఓ వాహనం ఆగిన కారును సమీపించింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, బ్రేకులు ఫెయిలవడంతో సమీపంలోని బాస్ ప్రో వేర్ హౌస్ నుంచి వాహనం అదుపుతప్పి దూసుకువచ్చిందని తెలుసుకున్నారు. దాడులకు సంబంధించిన సూచనలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా క్లేట్ హెఫ్నర్ అనే వ్యక్తి తీసిన వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement