క్యూబాకు అమెరికా తొలి విమానం | A powerful moment': first US-to-Cuba flight since 1961 is latest step in thaw | Sakshi
Sakshi News home page

55 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది..

Published Thu, Sep 1 2016 5:58 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

క్యూబాకు అమెరికా తొలి విమానం - Sakshi

క్యూబాకు అమెరికా తొలి విమానం

సాంటాక్లారా: అమెరికా, క్యూబా దేశాల మధ్య బుధవారం మరో చరిత్రాత్మకమైన రోజు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాండర్‌డేల్ నగరం నుంచి బయల్దేరిన ‘జెట్‌బ్లూ ఫ్లయిట్-387’ అనే ప్రయాణికుల విమానం క్యూబా దేశంలోని సాంటాక్లారాకు చేరుకోవడానికి 51 నిమిషాలు పట్టింది. అందుకు ఇరు దేశాల ప్రజలు 55 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి క్యూబాతోని సరైన సంబంధాలు లేకపోవడం వల్ల ఇరుదేశాల మధ్య కమర్షియల్ విమానాలు నిలిచిపోయి 55 ఏళ్లు అవుతోంది.

ఇన్నేళ్ల తర్వాత తొలి కమర్షియల్ విమానం అమెరికాలోని హాలివుడ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి బయల్దేరి క్యూబాలోని సాంటా మారియా విమానాశ్రయంలో దిగింది. అక్కడ అమెరికా విమానాశ్రయంలో నీటి ఫిరంగులతో విమానానికి వీడ్కోలు పలగ్గా, ఇక్కడ క్యూబా విమానాశ్రయంలో కూడా నీటి ఫిరంగులతో స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో విమానాశ్రయం అధికారులు, కార్మికులు, ప్రయాణికులు ఇరు దేశాల జెండాలు పట్టుకొని పాల్గొన్నారు. 
ముందుగా విమానం నుంచి అమెరికా రవాణా శాఖ మంత్రి ఆంథోని ఫాక్స్ దిగారు. ఆయనకు విమానాశ్రయం సిబ్బంది స్వాగతించారు. ఆయన వెంట జెట్‌బ్లూ ఫ్లైట్ కంపెనీ సీఈవో రాబిన్ హేస్ కూడా దిగారు. ఆయనకు నగర అధికారులు సాంటాక్లారా నగరం పెయింటింగ్స్‌ను బహుమానంగా ఇచ్చారు. ఒకప్పుడు క్యూబాకు రావాలంటే విమానాఞశ్రయానికి వెళ్లి టిక్కెట్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ప్రొపెల్లర్ విమానంలో రావాల్సి వచ్చేదని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయిందని హేస్ వ్యాఖ్యానించారు. ఇప్పడు ఆ లైన్‌లోనే టిక్కెట్లు కొనుక్కోవచ్చని, అమెరికాలోని పది నగరాల నుంచి క్యూబాకు రావచ్చని ఆయన తెలిపారు.

త్వరలోనే మరిన్ని అమెరికా ఎయిర్‌లైన్స్ మరికొన్ని కమర్షియల్ విమానాలను క్యూబాకు నడపనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2014 డిసెంబర్ నెలలోనే క్యూబా అధ్యక్షులు రౌల్ కాస్ట్రోను కలసుకొని దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నప్పటికీ ఆర్థిక ఆంక్షలు కొనసాగడం వల్ల అమెరికా తొలి ప్రయాణికుల విమానం ఇక్కడికి రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఇరు దేశాల సంబంధాల్లో చరిత్రాత్మకమైన రోజని అమెరికాలోని క్యూబా అంబాసిడర్ జోస్ రామన్ కబనాస్ వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement