'సముద్రం అడుగున వెతికితే ఆచూకీ తెలిసే ఆస్కారం'
జకర్తా: ఎయిర్ ఏషియా విమానం అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విమానం కూలి పోయి ఉండవచ్చని అనుమానిస్తున్న నేపథ్యంలో సముద్రం అడుగు బాగాన వెతికితే విమాన అదృశ్యంపై ఓ కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంటుందని ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బాంబేగ్ సోలిస్టో అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇండోనేషియా వద్ద సముద్రం అడుగుబాగాన వెతికేందుకు తగిన వనరులు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే ఒకవేళ ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తే మాత్రం ఇతర దేశాల సాయం తీసుకుంటామన్నారు.
ఆదివారం మలేసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి నిన్న ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్‌ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్(ఏ320-200) విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు వరకూ ఇండోనేషియా దేశస్థులు ఉన్నారు. ఇప్పటికే మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొన్నాయి.తాజాగా ఆస్ట్రేలియా రక్షణ దళాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి.