AirAsia flight
-
విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
రాంచీ: రాంచీ విమానాశ్రయంలో ఎయిర్ఏసియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో విమానంలో ఉన్న 174 ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాంచీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఏసియా విమానం బిర్సాముండా ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం వల్ల విమాన బ్లేడ్లు దెబ్బతిన్నాయి. వీటి చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. విమానంలోని ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా సిబ్బంది దింపివేశారు. విమానం కాస్త దెబ్బతిన్నా, ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. జూలై 12న రాంచీకి వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. సిబ్బంది వెంటనే డోర్ మూసివేశారు. అనంతరం రాంచీ ఎయిర్‌పోర్టులో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. -
నీటిలో మునిగేంతవరకు భద్రంగా ఉన్న విమానం!
లండన్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం సముద్రంపై దిగేంత వరకు భద్రంగానే ఉన్నట్లు 'ది మిర్రర్' కథనంలో పేర్కొంది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతున్న ఎయిర్ బస్ ఎ320 జెట్ విమానం గత డిసెంబర్ 28న జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 162 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. విమానం సముద్రంపై దిగేంత వరకు ఎటువంటి ప్రమాదం జరుగలేదని 'ది మిర్రర్' తెలిపింది. నీళ్లపై కొంత దూరం ప్రయాణించిన తరువాత విమానం మునిగిపోయనట్లు ఆ కథనంలో పేర్కొంది. మునిగిపోక ముందు విమానానికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడం వల్లే ఈఎల్టీపై ప్రభావంలేదని తెలిపింది. -
కొద్ది క్షణాల ముందు.. సీటు వదిలివెళ్లిన కెప్టెన్!
సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా జెట్ విమాన పైలట్.. ఆ ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు ఆ విమాన పైలట్.. తన సీటు వదిలి వెళ్లిపోయారట! ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి కో-పైలట్ విమానం మీద నియంత్రణ కోల్పోయారు. పైలట్ తిరిగి వచ్చేసరికే చాలా ఆలస్యం అయిపోయింది, విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని ఈ కేసు దర్యాప్తు చూసుకుంటున్న అధికారులు తెలిపారు. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ బస్ ఎ320 జెట్ విమానం డిసెంబర్ 28వ తేదీన జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 162 మంది మరణించారు. ఆ విమానంలో అప్పటికి వారం రోజులుగా ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ సమస్యలు ఉన్నాయి. విమానం కూలడానికి కొన్ని రోజుల ముందు కూడా ఇదే పైలట్.. ఇదే విమానాన్ని నడిపారు. అప్పుడూ ఈ సమస్య ఉంది. -
కో పైలట్ వల్లనే ప్రమాదమా!
ఇండోనేషియాలోని జావా సముద్రంలో గత నెల కూలిపోయిన ఎయిర్ ఆసియా విమాన ప్రమాదం కారణాలపై చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడిపోతోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ పైలట్ కాకుండా అంతగా అనుభవంలేని కో పైలట్ నడుపుతున్నాడని తేలిందని ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ విమాన ప్రమాదంలో 162 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటివరకు 70 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి. ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్8501 విమానం ప్రమాదం జరిగిన సమయంలో గగనతలంలో 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, అది హఠాత్తుగా 37, 400 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లడమే కాకుండా అంతే వేగంతో హఠాత్తుగా 24 వేల అడుగుల దిగువకు పడిపోయిందని కమిటీలో దర్యాప్తు అధికారిగా ఉన్న సీనియర్ పైలెట్ ఎర్తాట లానంగ్ గురువారం నాడు ఇక్కడ వెల్లడించారు. 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని 38 వేల అడుగులకు తీసుకెళ్లడానికి విమానం పైలట్, గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరారని, అయితే 34 వేల అడుగుల ఎత్తుకు తీసుకె ళ్లడానికి మాత్రమే గ్రౌండ్ కంట్రోల్ అనుమతించిదని ఆయన చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా విమానాన్ని 37, 400 అడుగులకు తీసుకెళ్లారని, అది పైకి దూసుకుపోతున్నప్పుడు ఏటవాలుగా ఎడమ వైపుకు ఒరిగి పోవడమే కాకుండా వణుకుతున్నట్టు రేడార్లో కనిపించిందని ఆయన వివరించారు. విమానం 24 వేల అడుగులకు హఠాత్తుగా పడిపోయిన తర్వాత రేడార్ స్క్రీన్ నుంచి అద్యశ్యమైందని, ఆ తర్వాత సముద్రంలో కూలిపోయిందని ఆయన తెలిపారు. అసలు ఉరుములు, మెరుపులు ఎక్కువగా వున్న ప్రాంతంలోకి విమానం ఎందుకు దూసుకెళ్లిందో తమకు అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని దర్యాప్తు కమిటీలోని ఇతర సభ్యులు తెలిపారు. -
సముద్రంలో 92 మృతదేహలు... గాలింపు నిలిపివేత
జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమాన శకలాలు, మృతదేహల అన్వేషణను నిలివేస్తున్నట్లు ఇండొనేసియా మిలటరీ ఉన్నతాధికారులు ప్రకటించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు.... మృతదేహల కోసం అలుపెరగకుండా అన్వేషణ చేయడంతో విమానం అన్వేషణ బృందంలోని సభ్యులు తీవ్ర అనార్యోగానికి గురైయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలటరీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటి వరకు జావా సముద్రం నుంచి 70 మృతదేహలను వెలికితీయగా... మరో 92 మృతదేహలు బయటకు తీయవలసి ఉందని చెప్పారు. అలాగే ఎయిర్ ఏషియా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌తోపాటు పలు శకలాలను అన్వేషణ బృందాలు వెలికి తీసిన సంగతిని మిలటరీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన విమాన ప్రయాణికులు, సిబ్బందితో సహా162 మందితో ఎయిర్ ఏషియా విమానం ఇండోనేసియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ క్రమంలో కొద్ది సేపటికే విమానం ఇండోనేసియా విమానాశ్రయ అధికారులతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమాన ఆచూకీ కోసం ఇండోసియా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అన్వేషణ ప్రారంభించారు. దాంతో ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది ప్రయాణికులు జల సమాధి అయినట్లు గుర్తించారు. నాటి నుంచి విమాన శకలాలు, మృతదేహల కోసం అన్వేషణ సాగుతున్న విషయం తెలిసిందే. -
'సముద్రం అడుగున వెతికితే ఆచూకీ తెలిసే ఆస్కారం'
జకర్తా: ఎయిర్ ఏషియా విమానం అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విమానం కూలి పోయి ఉండవచ్చని అనుమానిస్తున్న నేపథ్యంలో సముద్రం అడుగు బాగాన వెతికితే విమాన అదృశ్యంపై ఓ కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంటుందని ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బాంబేగ్ సోలిస్టో అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇండోనేషియా వద్ద సముద్రం అడుగుబాగాన వెతికేందుకు తగిన వనరులు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే ఒకవేళ ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తే మాత్రం ఇతర దేశాల సాయం తీసుకుంటామన్నారు. ఆదివారం మలేసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి నిన్న ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్(ఏ320-200) విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు వరకూ ఇండోనేషియా దేశస్థులు ఉన్నారు. ఇప్పటికే మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొన్నాయి.తాజాగా ఆస్ట్రేలియా రక్షణ దళాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి. -
మరో మలేసియా విమానం అదృశ్యం
-
మరో మలేసియా విమానం అదృశ్యం
ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తుండగా మాయమైన ఎయిర్ ఆసియా విమానం ప్రతికూల వాతావరణమే కారణం! విమానంలో సిబ్బంది సహా 162 మంది ప్రయాణికులు కొనసాగుతున్న గాలింపు చర్యలు మరో మలేసియా విమానం అదృశ్యమైంది. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన ఎయిర్ఆసియా విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అంతకు కొద్దిక్షణాల ముందే, ప్రతికూల వాతావరణముందని, విమాన ప్రయాణ మార్గపు ఎత్తును 32 వేల అడుగుల నుంచి 38 వేల అడుగులకు పెంచుకునేందుకు అనుమతించాలని పైలట్ ఏటీసీని అభ్యర్థించారు. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియావారే. సమాచారం అందగానే పెద్ద ఎత్తున గాలింపు చర్యలను ఇండోనేసియా ప్రభుత్వం ప్రారంభించింది. భారీ వర్షం, దట్టమైన మేఘాలు గాలింపు చర్యలను ఆటంకపర్చాయి. చీకటిపడటంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలను ప్రారంభించాలని నిర్ణయించారు. గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొనేందుకు మూడు నౌకలను, ఒక విమానాన్ని భారత్ సిద్ధంగా ఉంచింది. సుమత్రా సముద్ర తీరంలో తూర్పు బెలితుంగ్ జలాల్లో ఆ విమానం కూలిపోయిందని వచ్చిన వార్తలను అధికారులు ఖండిం చారు. ఈ సంవత్సరం ప్రమాదం బారిన పడిన మలేసియా విమానాల్లో ఇది మూడోది. జకర్తా/సింగపూర్: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్(ఏ320-200)..అరగంట తరువాత ఇండోనేసియా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7.24 గంటలకు(భారత కాలమానం ప్రకారం తెల్లవారుజాము 4.54) ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) పరిధి నుంచి దూరమైంది. అంతకుముందు, ప్రతికూల వాతావరణముందని, విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకునేందుకు (32 వేల అడుగుల నుంచి 38 వేల ఎత్తుకు వెళ్లేందుకు) అనుమతించమని పైలట్ల నుంచి అభ్యర్థన వచ్చిందని ఏటీసీ అధికారులు తెలిపారు. ఆ తరువాత కాసేపటికే రాడార్ సంకేతాలు ఆగిపోయాయన్నారు. విమానం అదృశ్యమయ్యే సమయానికి అది ఇండోనేసియా ఏటీసీ నియంత్రణలోనే ఉంది. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉన్నారు. వారిలో భారతీయులెవరూ లేరు. ప్రయాణికుల్లో ఇండోనేసియాకు చెందిన వారు 149 మంది ఉండగా, ముగ్గురు దక్షిణ కొరియావారు, బ్రిటన్, మలేసియా, సింగపూర్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. విమానంలో 16 మంది పిల్లలు, ఒక చిన్నారి ఉన్నారు. సిబ్బందిలోనూ ఆరుగురు ఇండోనేసియా వారే ఉన్నారు. మరో కోపైలట్ ఫ్రాన్స్ దేశస్తుడు. విమాన ఆచూకీ కోసం ఇండోనేసియా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు సైనిక విమానాలు, మరో హెలికాప్టర్ గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. జావా సముద్రాన్ని, అందులోని ద్వీపాలను నిశితంగా గాలించాయి. విమాన గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొనేందుకు మూడు నౌకలను, ఒక తీరగస్తీ విమానాన్ని భారత్ సిద్ధంగా ఉంచింది. మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొననున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియాలు కూడా గాలింపులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. గాలింపు చర్యల్లో స్థానిక మత్స్యకారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే, దట్టంగా మేఘాలు ఆవరించి ఉండటం, భారీగా వర్షం పడుతుండటంతో పాటు చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపేశామని, తిరిగి సోమవారం తెల్లవారు జామున ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కొన్ని నౌకలు రాత్రి కూడా గాలింపు జరుపుతాయన్నారు. కూలిపోయిందా!? కాగా, సుమత్ర సముద్ర తీరంలో తూర్పు బెలితుంగ్ జలాల్లో ఆ విమానం కూలిపోయిందని, కొని శకలాలను గుర్తించారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాటిని మలేసియా రవాణా మంత్రి ల్యూ తియాంగ్ లాయి ఖండించారు. ఆ వార్తలు నిరాధారమని, విమాన గాలింపు కొనసాగుతోందని స్పష్టం చేశారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో 50 వేల అడుగుల ఎత్తు వరకు దట్టమైన మేఘాలున్నాయని, ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉందని ఇండోనేసియా విమానయాన డెరైక్టర్ జోకో ముర్జత్మోజొ వెల్లడించారు. బెలితుంగ్ ద్వీపంలోని తాంజుంగ్ పాండన్, ఇండోనేసియాలోని కాళీమంతన్ల మధ్య గగనతలంలో విమానమున్నప్పుడు చివరిసారిగా దాని నుంచి సంకేతాలొచ్చాయన్నారు. విమానం అదృశ్యమై చాలా గంటలు గడవడంతో ప్రయాణికులంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎయిర్ఆసియా తక్కువ ధరలకే విమాన సేవలందిస్తూ ‘బడ్జెట్ క్యారియర్’గా పేరుగాంచింది. ఆ గ్రూప్ సీఈఓగా భారత సంతతికి చెందిన టోనీ ఫెర్నాండెజ్ వ్యవహరిస్తున్నారు. ఇరుగుపొరుగు దేశాలకు విమాన సేవలందించేందుకు ఆయన పలు బడ్జెట్ విమానాలను ప్రారంభించారు. విమాన పైలట్‌గా ఉన్న కెప్టెన్ ఇరియాంతొకు 6,100 గంటల పైలటింగ్ అనుభవం ఉంది. మలేసియా విమానాలకు గ్రహణం! మలేసియా విమానాలను దురదృష్టం వెంటాడుతోంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘ఎంహెచ్370’ విమానం గల్లంతైన కొన్ని నెలలకే ఆదివారం మరో మలేసియా విమానం ఆచూకీ లేకుండా పోయింది. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూడా మలేసియా విమానాన్నే నేలకూల్చారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడు ఘోర విమాన ప్రమాదాలను మలేసియా చవి చూసినట్లైంది. ఈ ఏడాది మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళుతుండగా సింగపూర్‌కు కొన్ని వందల మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఎంహెచ్370 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఇప్పటిదాకా ఆ విమానం, అందులోని 239 మంది ప్రయాణికుల ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆ తర్వాత జూలై 17న ఆమ్స్టర్డాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్ విమానం ‘ఎంహెచ్ 17’ను ఉక్రెయిన్ గగనతలంలో తిరుగుబాటుదారులు కూల్చివేశారు. ఈ ఘటనలో 300 మంది మృతిచెందారు. తాజాగా అదృశ్యమైన ‘ఎయిర్ఏసియా’ విమానంలోనూ 162 మంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి గతం పునరావృతం కాకూడదని ప్రతిఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. -
ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం
-
ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం
సింగపూర్: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. 162 మందితో సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన విమానంతో కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా మీడియా వెల్లడించింది. ఆదివారం ఉదయం 7.24 గంటలకు(స్థానిక కాలమానం) జకర్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. విమానం పైకి ఎగిరిన 42 నిమిషాల తర్వాత విమానం అదృశ్యమైంది. సురబయా(ఇండోనేసియా) విమానాశ్రయం నుంచి ఉదయం 5.20 గంటలకు విమానం పైకి ఎగిరింది. ఈ ఉదయం 8.30 గంటలకు విమానం సింగపూర్ చేరాల్సివుంది. విమానం అదృశ్యమైన విషయాన్ని ఎయిర్ ఏషియా ధ్రువీకరించింది. 'విమానం-క్యూజెడ్8501 విమానం అదృశ్యమైందని తెలపడానికి చింతిస్తున్నాం. ప్రస్తుత సమయంలో ఇతర విషయాలు చెప్పలేకపోతున్నాం' అని ఎయిర్ ఏషియా ట్విటర్, ఫేస్ బుక్ లో పేర్కొంది. AirAsia Indonesia regrets to confirm that QZ8501 from Surabaya to Singapore has lost contact at 07:24hrs this morning http://t.co/WomRQuzcPO — AirAsia (@AirAsia) December 28, 2014