కొద్ది క్షణాల ముందు.. సీటు వదిలివెళ్లిన కెప్టెన్! | AirAsia captain left seat before jet lost control | Sakshi
Sakshi News home page

కొద్ది క్షణాల ముందు.. సీటు వదిలివెళ్లిన కెప్టెన్!

Published Sat, Jan 31 2015 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

కొద్ది క్షణాల ముందు.. సీటు వదిలివెళ్లిన కెప్టెన్!

కొద్ది క్షణాల ముందు.. సీటు వదిలివెళ్లిన కెప్టెన్!

సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా జెట్ విమాన పైలట్.. ఆ ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు ఆ విమాన పైలట్.. తన సీటు వదిలి వెళ్లిపోయారట! ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి కో-పైలట్ విమానం మీద నియంత్రణ కోల్పోయారు. పైలట్ తిరిగి వచ్చేసరికే చాలా ఆలస్యం అయిపోయింది, విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని ఈ కేసు దర్యాప్తు చూసుకుంటున్న అధికారులు తెలిపారు.

ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ బస్ ఎ320 జెట్ విమానం డిసెంబర్ 28వ తేదీన జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 162 మంది మరణించారు. ఆ విమానంలో అప్పటికి వారం రోజులుగా ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ సమస్యలు ఉన్నాయి. విమానం కూలడానికి కొన్ని రోజుల ముందు కూడా ఇదే పైలట్.. ఇదే విమానాన్ని నడిపారు. అప్పుడూ ఈ సమస్య ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement