నీటిలో మునిగేంతవరకు భద్రంగా ఉన్న విమానం!
లండన్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం సముద్రంపై దిగేంత వరకు భద్రంగానే ఉన్నట్లు 'ది మిర్రర్' కథనంలో పేర్కొంది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతున్న ఎయిర్ బస్ ఎ320 జెట్ విమానం గత డిసెంబర్ 28న జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 162 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే.
విమానం సముద్రంపై దిగేంత వరకు ఎటువంటి ప్రమాదం జరుగలేదని 'ది మిర్రర్' తెలిపింది. నీళ్లపై కొంత దూరం ప్రయాణించిన తరువాత విమానం మునిగిపోయనట్లు ఆ కథనంలో పేర్కొంది. మునిగిపోక ముందు విమానానికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడం వల్లే ఈఎల్టీపై ప్రభావంలేదని తెలిపింది.