ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం
సింగపూర్: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. 162 మందితో సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన విమానంతో కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా మీడియా వెల్లడించింది. ఆదివారం ఉదయం 7.24 గంటలకు(స్థానిక కాలమానం) జకర్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి.
విమానం పైకి ఎగిరిన 42 నిమిషాల తర్వాత విమానం అదృశ్యమైంది. సురబయా(ఇండోనేసియా) విమానాశ్రయం నుంచి ఉదయం 5.20 గంటలకు విమానం పైకి ఎగిరింది. ఈ ఉదయం 8.30 గంటలకు విమానం సింగపూర్ చేరాల్సివుంది. విమానం అదృశ్యమైన విషయాన్ని ఎయిర్ ఏషియా ధ్రువీకరించింది. 'విమానం-క్యూజెడ్8501 విమానం అదృశ్యమైందని తెలపడానికి చింతిస్తున్నాం. ప్రస్తుత సమయంలో ఇతర విషయాలు చెప్పలేకపోతున్నాం' అని ఎయిర్ ఏషియా ట్విటర్, ఫేస్ బుక్ లో పేర్కొంది.
AirAsia Indonesia regrets to confirm that QZ8501 from Surabaya to Singapore has lost contact at 07:24hrs this morning http://t.co/WomRQuzcPO
— AirAsia (@AirAsia) December 28, 2014