జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: అపర కుబేరుల సంపదకు సంబంధించి తాజా నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2026 నాటికి అమెజాన్ టాప్ బాస్ జెఫ్ బెజోస్ (56) ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా అవతరించనున్నారట. 62 సంవత్సరాల వయసు నాటికి బెజోస్ 1,000 బిలియన్లకు పైగా నికర విలువను సాధించే అవకాశం వుందని కంపారిసున్ చేసిన అధ్యయనం తెలిపింది. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌అంబానీ 2033 నాటికి ట్రిలియనీర్ కావచ్చని అంచనా వేసింది. కంపారిసున్ ప్రకారం, ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదవ వ్యక్తిగా అంబానీ నిలవనున్నారు. అలాగే చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జు జియాయిన్ ప్రపంచంలో రెండవ ట్రిలియనీర్ కావచ్చని అధ్యయనం తేల్చింది.
ఫోర్బ్స్ అందించిన అత్యంత విలువైన సంస్థల మార్కెట్ క్యాప్‌లను, టాప్ 25 ధనవంతుల సంపదలను కంపారిసన్ విశ్లేషించింది. గత ఐదేళ్లలో నమోదు చేసిన సంస్థల వార్షిక విస్తరణ, సగటు శాతంపై ఆధారపడి ఈ విశ్లేషణ చేసింది. అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ బెజోస్ నికర విలువ గత ఐదేళ్లలో 34 శాతం ఎగిసి 143 బిలియన్ డాలర్లకు పెరిగింది.
కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్, హోమ్ డెలివరీల డిమాండ్ పెరిగింది కాబట్టి, అమెజాన్ వ్యాపారం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుత సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అమెజాన్ 75 బిలియన్ డాలర్లకు పైగా అమ్మకాలు నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 60 బిలియన్ డాలర్లు. దీంతోపాటు కరోనా వైరస్ ఉధృతి, లాక్‌డౌన్ల వరుస పొడిగింపులతో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
కాగా ప్రస్తుత ప్రపంచ సంక్షోభానికి ముందే, అమెజాన్ 2019లో 281 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. మరోవైపు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా అవతరించే ప్రణాళికలో వడివడిగా దూసుకుపోతున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో మెగా పెట్టుబడులను సాధిస్తున్న సంగతి తెలిసిందే. (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం)
Comments
Please login to add a commentAdd a comment