సెక్స్టాయ్ పంపించి మహిళకు షాక్ | Amazon shopper mistakenly sent anal sex toy before staff joked 'we'll get to the bottom of it' | Sakshi
Sakshi News home page

సెక్స్టాయ్ పంపించి మహిళకు షాక్

Published Tue, May 17 2016 5:55 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

సెక్స్టాయ్ పంపించి మహిళకు షాక్ - Sakshi

సెక్స్టాయ్ పంపించి మహిళకు షాక్

న్యూయార్క్: అమెజాన్ సంస్థ ఓ మహిళా కస్టమర్ కు షాకిచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా ఓ సెక్స్ టాయ్ ను పంపించి అవాక్కయ్యేలా చేసింది. దీంతో ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమె తనకు జరిగిన అవమానంపై సామాజిక మాధ్యమాల్లో దూరి అమెజాన్ ను నిలదీసింది. నోలీన్ గ్రీన్ (28) అనే మహిళ మూడు బెల్లీ బటన్ బార్లకోసం ఆర్డర్ చేసింది. కానీ, ఆ ప్యాకెట్ విప్పి చూడగా అందులో ఓ సెక్స్ టాయ్ కనిపించింది. దీంతో ఆమె అమెజాన్ ప్రశ్నించగా అది బదులిచ్చింది.

నిజంగా ఆమె బెల్లీ బటన్ బార్లకోసం ఆర్డర్ చేసి ఉంటే తప్పకుండా తాము పంపించిన ఆ సెక్స్ టాయ్ను వెనక్కి తీసుకుంటామని, ఆమెకు అండగా నిలబడతామని చెప్పింది. ఆ వస్తువును చూసినప్పుడు ఆమె పొందిన ఆందోళనను అర్ధం చేసుకోగలమని కూడా వివరించింది. కాగా, తనకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని, తల్లిదండ్రులు కూడా ఉన్నారని.. వారు తనను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోవాలని.. అసలు తాను ఒకటి ఆర్డర్ చేస్తే మరొక వస్తువును ఎలా పంపిస్తారని, అది కూడా అసభ్యకరమైన వస్తువును పంపిస్తారా అని ప్రశ్నించింది. ఇంకోసారి అమెజాన్ లో అసలు షాపింగ్ చేయబోనని ఆమె చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement