బలవుతున్న అమెరికా పోలీసులు
న్యూయార్క్: అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతిని అరికట్టడంలో భాగంగా అక్కడి పోలీసులు విధి నిర్వహణలో బలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకే 51 మంది అమెరికా పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు వదిలారు. డల్లాస్‌లో మంగళవారం రాత్రి నల్లజాతీయుల నిరసన ప్రదర్శనల సందర్భంగా ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
2015లో 124 మంది పోలీసులు విధి నిర్వహణలో మరణించారని ‘నేషనల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ మెమోరియల్ ఫండ్’ తెలియజేసింది. 1970 నుంచి విధి నిర్వహణలో పోలీసుల మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. 1974లో ఎక్కువ మరణాలు సంభవించాయని, ఆ ఏడాది ఏకంగా 280 మంది పోలీసులు మరణించారు.