శారా సాండర్స్
వాషింగ్టన్: తరచూ అమెరికాను బెదిరిస్తోన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై యూఎస్ విరుచుకుపడింది. ‘తన డెస్క్ పైనే అణు బాంబు బటన్ ఉంటుందం’టూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న కిమ్ మానసిక పరిస్థితిని అమెరికా అధ్యక్ష భవనం అధికారులు ప్రశ్నించారు. ఈమేరకు గురువారం అమెరికా అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి శారా సాండర్స్ విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ..‘‘గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తరచూ అణు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాను బెదిరిస్తున్నారు. ఇలా పదే పదే బెదిరింపులకు పాల్పడటం అతని మానసిక స్థితి లేమిని తెలియజేస్తోంద’’ని అన్నారు.
కిమ్‌కు వ్యాఖ్యలకు ధీటుగా ‘‘అణుబాంబు బటన్ నా టేబుల్ వద్దా ఉంది. అది మీ కంటే ఎక్కువ శక్తివంతమైనది, పెద్దది కూడా. అది బాగా పనిచేస్తుంది’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌ను ఉద్దేశించి అమెరికా రాజకీయ విశ్లేషకులు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. ట్రంప్‌కు మతిస్థిమితం లేదంటూ వస్తోన్న విమర్శలపై సాండర్స్ వివరణ ఇచ్చారు. ‘‘అమెరికా ప్రజల పరిరక్షణకు, దేశ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ట్రంప్ వెనకడుగు వేసే పరిస్థితి లేద’’ని ఆమె స్పష్టం చేశారు.
సీనియర్ జర్నలిస్టు, రచయిత మైకేల్ వూల్ఫ్ రాసిన ‘ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్’ పుస్తకంలో కల్పనలే ఉన్నాయని శారా సాండర్స్ పేర్కొన్నారు. ఈ పుసక్తం ట్రంప్ ప్రతిష్ఠను దిగజార్చేదిగా, హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment